NEET (UG) 2021 Date Announced: సెప్టెంబర్ 12 న దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్షలు, జూన్‌ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ, కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న (Examination to Held on September 12) నిర్వహిస్తామని తెలిపారు.

Exams Representational Image. |(Photo Credits: PTI)

New Delhi, July 12: మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షల తేదీలను (NEET (UG) 2021 Date Announced) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖరారు చేశారు. దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న (Examination to Held on September 12) నిర్వహిస్తామని తెలిపారు. అయితే పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని కేంద్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రకటించారు.

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.

విద్యార్థుల నుంచి దరఖాస్తులను జూన్‌ 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్‌-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.

ఆగస్టు 15 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, అప్పటిలోగా నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్

అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తొలుత ఆగస్టు 1న నీట్‌ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఖరారయిన జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షల తేదీలు, మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహణ

హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 11 భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, కరోనా ఉద్ధృతి కారణంగా పలు పరీక్షలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నీట్‌ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ సెప్టెంబర్‌ 12న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.