Health Tips: చలికాలంలో ఈ డైట్ తీసుకుంటే జబ్బులు మీ జోలికి రమ్మన్నా రావు..
ఈ సీజన్ లో మనకు అనారోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రతి ఒక్కరు ప్రాధ్యానత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం తోనే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అని ప్రముఖ డైటీషియస్ అంజు మోహన్ చెబుతున్నాడు.
చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్ లో మనకు అనారోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రతి ఒక్కరు ప్రాధ్యానత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం తోనే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అని ప్రముఖ డైటీషియస్ అంజు మోహన్ చెబుతున్నాడు.
జీవనశైలి, వయసు, ఒత్తిడి వంటి ఎన్నో అంశాలు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఆరోగ్య సవాళ్లను ఐదు అంశాలతో అడ్డుకట్ట వేయవచ్చని అంజు పేర్కొన్నాడు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ తో కూడిన సమతులాహారంతో పాటు పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం సరైన మోతాదులో ఉండాలని నిఫుణులు చెబుతున్నాడు.
ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, నట్స్, సీడ్స్ లో ఉండే విటమిన్ ను అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.ఇక ఆరోగ్యకర ఆహారంతో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయాలి.వ్యాధులతో రోగనిరోధక వ్యవస్థ దీటుగా పోరాడేందుకు అవసరమైన ఉత్తేజాన్ని అందించే విధంగా శారీరకంగా చురుకుగా ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. చలికాలంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటాలంటే ఈ ఐదు సూచనలను, సలహాలను పాటించాలని డైటీషియస్ అంజు మోహన్ సూచించారు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా