'India Will Never Forget': మరువనిదీ ఈ గాయం! పుల్వామా దాడి జరిగి నేటికి ఏడాది, అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి పక్కనే ఉన్న ఈ ప్రదేశంలో అమరులైన 40 మంది వీర జవాన్ల పేర్లతో పాటు పారామిలిటరీ ఫోర్స్ నినాదం "సేవా మరియు విశ్వాసం (సర్వీస్ అండ్ లాయల్టీ) ముద్రించబడి ఉంటుంది.....

Pulwama Attack Site | (Photo Credits: PTI)

New Delhi, February 14:  జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా వద్ద ఆత్మాహుతి దాడి (Pulwama Terror Attack) జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఫిబ్రవరి 14, 2019న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పిఎఫ్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన జైష్-ఇ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసున్నాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతావనిని కలిచివేసింది.

పుల్వామా దాడిలో అమరులైన కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్లకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జవాన్ల ధైర్యసాహాసాలను ప్రధాని మోదీ కొనియాడారు.  అంతకు మించిన దాడులు చేస్తాం!

"గతేడాది జరిగిన దారుణ మారణకాండ పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నా నివాళులు. వారు మన దేశసేవలో, మన రక్షణలో తమ జీవితాలనే అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు. భారతదేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోదు" అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

"పుల్వామా దాడిలో అమరులలైన వీరులకు నేను నివాళులర్పించాను. మన మాతృభూమి సార్వభౌమాధికారం, సమగ్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన మన ధైర్యవంతులకు మరియు వారి కుటుంబాలకు భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది" అని హోంమంత్రి అమిత్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు.  పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన కశ్మీర్‌ జైషే చీఫ్‌ హతం 

" గతేడాది ఇదే రోజున పుల్వామా వద్ద జరిగిన దారుణమైన మారణకాండలో నేలరాలిన జవాన్లను స్మరించుకుంటున్నాను. భారతదేశం వారి త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోదు. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలుస్తుంది. ఈ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది"అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఇక పుల్వామా అమరవీరుల జ్ఞాపకార్థం, లెత్‌పోరా శిబిరంలో నిర్మించిన ఒక స్మారక చిహ్నాన్ని నేడు ప్రారంభిచనున్నారు. పుల్వామా దాడి జరిగిన ప్రదేశానికి పక్కనే ఉన్న ఈ ప్రదేశంలో అమరులైన 40 మంది వీర జవాన్ల పేర్లతో పాటు పారామిలిటరీ ఫోర్స్ నినాదం "సేవా మరియు విశ్వాసం (సర్వీస్ అండ్ లాయల్టీ) ముద్రించబడి ఉంటుంది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..