Srinagar, January 26: 2019లో ఫిబ్రవరి 14 ఆత్మాహుతి బాంబు దాడిలో కీలక పాత్ర పోషించిన జైష్-ఎ-మొహమ్మద్ యొక్క సెల్ఫ్ స్టైల్ చీఫ్ ఖారీ యాసిర్ (JeM Kashmir chief Qari Yasir) పుల్వామా ఎన్‌కౌంటర్‌లో (Pulwama Encounter)హతమయ్యాడు. కాశ్మీర్‌లో భారత గణతంత్ర దినోత్సవం (India Republic Day 2020) సందర్భంగా దక్షిణ కాశ్మీర్లో అతను మరో ఇద్దరు సహచరులతో కలిసి భారీ దాడులకు సిద్ధపడ్డారని, అందుకోసం ప్రణాళిక వేసినట్లు భద్రతా అధికారులు శనివారం పేర్కొన్నారు.
పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఖారీ యాసిర్ కు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. త్రాల్‌లోని హరిపారిగం గ్రామ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు.అతనితో పాటు మరో ఇద్దరు సహచరులు పాకిస్తాన్ నివాసి మూసా, ట్రాల్ నివాసి బుర్హాన్ కూడా కాల్పుల్లో మరణించారు.
పాకిస్థాన్ లోపలికి చొచ్చుకు వస్తాం
గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడిలో యాసిర్ పాలుపంచుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాల్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఖారీ ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని, అతను ఉగ్ర నియామకాలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను తరలించడం వంటివి చేస్తాడని ధిల్లాన్ తెలిపారు. గత సంవత్సరం పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థను నిర్వీర్యం చేయగలిగామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ (Lt General Kanwal Jeet Singh Dhillon)అన్నారు.
Here's ANI Tweet
Lt General KJS Dhillon,Chinar Corps Commander: Today morning we got information of some Jaish-e-Mohammed terrorists who were planning to do some act of terrorism on January 26 in Tral. So, today morning the operation was launched. The operation is still underway. #JammuandKashmir pic.twitter.com/ckoOW178Xd
— ANI (@ANI) January 25, 2020
లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ మాట్లాడుతూ... కొద్ది రోజుల క్రితం శ్రీనగర్‌లో (Srinagar) అరెస్టు చేసిన జైష్ మాడ్యూల్ నుంచి దక్షిణ కాశ్మీర్‌లో చురుకుగా ఉన్న జెఎమ్ మిలిటెంట్ బుర్హాన్ గురించి మాకు తెలిసింది. వారు దాడులకు పథక రచన చేస్తున్నారని తెలుసుకున్నాం. అక్కడ ఖరీ యాసిర్ కూడా ఉన్నారని తెలిపారు.
శ్రీనగర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి
పుల్వామా జిల్లాలో సమీపంలోని క్రూ ప్రాంతంలో మిలిటెన్సీ వ్యతిరేక ఆపరేషన్ ముగిసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ దాడుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు
ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్ స్థలం సమీపంలో కూడా నిరసనలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టియర్ గ్యాస్ షెల్స్ కాల్చడం ద్వారా బలగాలు వెనక్కు వెళ్లాలని అక్కడ ఉన్న యువత భద్రతా దళాలపై రాళ్ళు విసిరారని వారు తెలిపారు.
భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు ముమ్మరం చేశారని, దక్షిణ కాశ్మీర్‌లో చాలా కదలికలు ఉన్నాయని డిజిపి దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.జమ్మూ కాశ్మీర్‌లో శాంతి కోసం మేము మరింత బలంగా కృషి చేస్తామని ఈ దాడులను తిప్పి కొడతామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
నూతన ఆర్మీ జనరల్ ఎమ్ ఎమ్ నరవణే
ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్?
అమ్మాయిలతో రాసలీలలు సాగించేలా భారత గూఢాచారులు ఉండరు