Bank of Baroda Jobs: రూ. 5 లక్షల వార్షిక వేతనంతో 546 బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్, మార్చి 14తో ముగియనున్న చివరి గడువు, వెంటనే అప్లయి చేసుకోండి
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది.
బ్యాంకులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Jobs) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 546 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు ప్రకటన ప్రకారం.. ఈసారి 500 అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులు, 15 ప్రైవేటు బ్యాంకర్ పోస్టులు, 19 వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి, సెకండ్లలో మీ ఫోన్‌కి మెసేజ్
ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 22న బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 14. మెట్రో నగరాల్లో పని చేసేవారి కనీస వేతనం రూ.5 లక్షలు కాగా.. నాన్ మెట్రో నగరాల్లో ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ. 4 లక్షలుగా ఖరారు చేశారు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించాక ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వైజాగ్, హైదరాబాద్ నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.