Cyclone Tej: బలపడుతున్న తేజ్ తుఫాను.. ఆదివారం మధ్నాహ్నానికి మరింత తీవ్రం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం.. గుజరాత్‌ కు ఐఎండీ అలర్ట్

ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది.

Cyclone (Photo-ANI)

Newdelhi, Oct 22: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (IMD) కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను (Cyclone Tej) మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది. అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నానికి మరింతగా బలపడి, తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది. ఇక ప్రస్తుతం తేజ్‌ తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు గరిష్ఠంగా 62 నుంచి 88 కి.మీ వేగంతో వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. ఈ గాలుల వేగం 89 - 117 కి.మీ.లకు చేరితే తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు.

TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే

గుజరాత్‌ పై తీవ్ర ప్రభావం

ఈ తుఫాను భారత్‌ లోని గుజరాత్‌ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండడంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని లెక్కగట్టింది. అయితే తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దాని పక్కనే ఉన్న యెమెన్ దక్షిణ తీరాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి