Ex-Agniveers To Get Reservation: ‘అగ్నివీర్’లకు శుభవార్త.. రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్.. నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్.. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపుతో పాటు వయో పరిమితిలోనూ సడలింపు
నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగాల్లో (Railway Jobs) రెండు దఫాల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు (Railway Board) నిర్ణయించింది.
Newdelhi, May 12: ‘అగ్నివీర్’లకు (Agniveer) కేంద్రప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగాల్లో (Railway Jobs) రెండు దఫాల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు (Railway Board) నిర్ణయించింది. అలాగే, వయో పరిమితిలో సడలింపుతోపాటు దేహదారుఢ్య పరీక్షల నుంచి కూడా వారికి మినహాయింపు ఇవ్వనున్నారు. దివ్యాంగులు, మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసిన వారితో సమానంగా లెవల్-1లో 10 శాతం, లెవల్-2, ఆపైన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ లభించనుంది.
ఇదే నిబంధన
అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి ఐదు సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌ల నుంచి మూడేళ్ల చొప్పున వయోపరిమితిపై సడలింపు లభిస్తుంది. అయితే, దీనికో నిబంధన ఉన్నది. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్న వారికే ఈ సడలింపు లభించనుంది. అలాగే, ఆర్పీఎఫ్ కూడా అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్ కల్పించాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.