Gold prices: ఇంకో ఏడాదిలో లక్షన్నరకు చేరనున్న తులం బంగారం, భారీగా పెరుగనున్న గోల్డ్ రేట్, ఇన్వెస్ట్ మెంట్లు పెరగడమే కారణం

"స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉంది

3,350 Tonne Goldmine Discovered by Geological Survey of India in Sonbhadra District

New Delhi, January 21: గత కొద్ది రోజులుగా బంగారం ధర(Gold Price) రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కేవలం గత 10 రోజుల్లోనే తులం బంగారం(10 Grams gold) ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. డాలరు(dolor)తో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు (Interest rate), దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock markets) పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు(Gold price) పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు" మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విపీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ పర్సన్ నవనీత్ దమాని చెప్పారు. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం. అంటే, ఒక గ్రాము ధర రూ.5,252కు చేరుకోనుంది.

ప్రస్తుతం బంగారం ధర భారతదేశంలో రూ.48,589 (ప్రతి 10 గ్రాములకు) వద్ద ట్రేడవుతోంది. అమెరికా(America)లో ప్రస్తుత బంగారం ధరలు $1840/ఔన్స్‌ వద్ద ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్(Motilal Oswal) నివేదిక 2021లో ప్రధాన ముఖ్యాంశాలలో ద్రవ్యోల్బణం ఒకటిగా ఉందని, వచ్చే ఏడాది కూడా ద్రవ్యోల్బణం పెరగవచ్చు అని ఈ నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి అని నివేదిక స్పష్టం చేసింది.