New Pension Plan: త్వరలోనే పెరుగనున్న నెలవారీ పెన్షన్, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం, కొత్త పెన్షన్ పాలసీపై కసరత్తు, ఏవేవీ మారబోతున్నాయో తెలుసా?

నెలవారీ పెన్షన్‌ త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ పెన్షన్స్‌ను పెంచడానికి ఈపీఎఫ్‌వో ఓ కొత్త ప్లాన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. నిజానికి పెన్షన్‌ స్కీం-1995 కింద కనీస పెన్షన్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో వేతన జీవులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.

File image of EPFO office | (Photo Credits: PTI)

New Delhi, Feb 13: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్‌ త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ పెన్షన్స్‌ను పెంచడానికి ఈపీఎఫ్‌వో (EPFO) ఓ కొత్త ప్లాన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. నిజానికి పెన్షన్‌ స్కీం-1995 (Pension Scheme-1995) కింద కనీస పెన్షన్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో వేతన జీవులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్‌వో నయా పెన్షన్‌ ప్లాన్‌ (new pension plan) దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్వయం ఉపాధి వర్గాలకు కూడా లాభం జరిగేలా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. జమచేసే సొమ్ము ఆధారంగానే ఈ ఫిక్స్‌డ్‌ పెన్షన్‌ (Fixed Pension) మొత్తాలుంటాయి. ప్రస్తుత ఎంప్లాయీ స్‌ పెన్షన్‌ స్కీంలో ఉద్యోగి బేసిక్‌ సాలరీలో 12 శాతం పీఎఫ్‌కు వెళ్తున్నది. మరో 12 శాతం సంస్థ ద్వారా ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో చేరుతున్నది. అయినప్పటికీ నెలవారీ పెన్షన్‌ రూ.15,000 దాటరాదు.

Aadhaar-UAN Linking: సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి

దీంతో గరిష్ఠంగా పెన్షన్‌ ఫండ్‌కు చేరే నెలవారీ మొత్తం రూ.1250గానే ఉంటున్నది. ప్రస్తుతం ఈపీఎస్‌కు జమవుతున్న మొత్తాలపై పన్ను లేదు. దీంతో దీన్ని పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అదనపు పెన్షన్‌తో ఊరటనివ్వాలని ఈపీఎఫ్‌వో భావిస్తున్నట్టు వినిపిస్తున్నది. ప్రస్తుత పద్దతి ప్రకారం ఉద్యోగి మాత్రమే కాకుండా, అంతే మొత్తం యజమాని ఖాతా నుంచి పీఎఫ్ ఖాతాలో(PF Account) జమ అవుతుంది. కానీ, యజమాని కంట్రిబ్యూషన్ చేసే మొత్తంలో 3.67 శాతం పీఎఫ్ లో, 8.33 శాతం ఈపీఎస్ లో జమ చేస్తుంది.

PF Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఏయే సందర్భాల్లో, ఎంత డబ్బు విత్ డ్రా చేయవచ్చో తెలుసుకోండి.

కొత్త పెన్షన్‌ ప్లాన్‌లో ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఉంటుంది. అయితే, మీరు కోరుకున్న పెన్షన్ కోసం ఆ మేరకు మీరు సహకారం అందించాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. జీతం, మిగిలిన సర్వీస్ ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఉద్యోగుల పెన్షన్ స్కీం-1995 ఆప్షన్ కొరకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది.