Aadhaar, EPFO (Photo Credits: Facebook)

ఆధార్‌తో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు సమయం దగ్గరకు వచ్చేసింది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ లింక్ (Aadhaar-UAN Linking) చేయడానికి ఈపీఎఫ్ఓ ​​గడువును సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించింది. ఈ లోపు సంస్థ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ని ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, EPFO ​​సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 లో మార్పులు చేసింది. ఇది ECR ఫైలింగ్ ప్రోటోకాల్‌ని మార్చింది.

ప్రతి ఉద్యోగి/కార్మికుడు వెంటనే తమ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని EPFO ప్రకటించింది. ఇందుకు ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉందని ప్రకటించింది. ఈ సమయం లోగా లింక్ చేసుకోకుంటే కంపెనీలు/సంస్థ యజమానులు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోకి డబ్బు జమ చేయడం సాధ్యం కాదు. అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందడమూ వీలుకాదు. సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది.

రిలయన్స్ నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్, జియోఫోన్ నెక్స్ట్ బుకింగ్స్ వచ్చే వారం నుంచే, ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలపై ఓ లుక్కేసుకోండి

రెండింటిని లింక్ చేయనివారికి PF కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర EPFO సేవలు కూడా ఆగిపోతాయి. పెన్షన్ ఫండ్‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. పెన్షన్ ఫండ్‌కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు. కంట్రిబ్యూషన్లు డిపాజిట్ చేయకపోవడం వల్ల యజమానులు/కంపెనీలుగా కూడా డిఫాల్టర్లు అవుతారు. ఫలితంగా చట్టప్రకారం శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది.

ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్‌ను డిపాజిట్ చేయడం కూడా వీలుపడదు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్‌ఓ ఇది వరకే ప్రకటించింది.

PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో వివరాలు

1) PF ఖాతాకు ఆధార్ జోడించడానికి epfindia.gov.in ని సందర్శించండి

2) ఆన్‌లైన్ సర్వీసెస్‌లో E-KYC పోర్టల్‌పై క్లిక్ చేయండి, తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్’ ఎంపికపై క్లిక్ చేయండి.

3) ఇప్పుడు ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. అప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.

4) ఇప్పుడు మరోసారి, ఆధార్ నంబర్ నింపాల్సి ఉంటుంది. తరువాత మీకు వచ్చిన OTP ని ధృవీకరించండి.

5) OTP, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్‌ను మూడుసార్లు నమోదు చేసిన తర్వాత,

మీ PF ఖాతాతో ఆధార్ లింక్ పూర్తి అవుతుంది.

EPF తో లింక్ చేయడానికి ఆఫ్‌లైన్ ప్రక్రియ..

ఆధార్‌ను ఇపిఎఫ్ (EPF) ఆఫ్‌లైన్‌తో కూడా లింక్ చేయవచ్చు. దీని కోసం మీరు EPFO ​కార్యాలయానికి వెళ్లాలి. మీరు EPFO ​​కార్యాలయానికి వెళ్లి ‘ఆధార్ సీడింగ్ అప్లికేషన్’ ఫారమ్‌ను పూరించాలి. అన్ని వివరాలతో మీ UAN మరియు ఆధార్‌ని ఫారమ్‌లో నమోదు చేయండి. మీ UAN, PAN, ఆధార్ యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీలు ఫారంతో జతచేnear. ఇది EPFO ​లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) అవుట్‌లెట్ యొక్క ఏదైనా ఫీల్డ్ ఆఫీస్‌లో ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించాలి. సరైన ధృవీకరణ తర్వాత, మీ EPF ఖాతాకు మీ ఆధార్ లింక్ చేయబడుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే సందేశం ద్వారా మీరు ఈ సమాచారాన్ని పొందుతారు.