JioPhone Next (Photo Credits: Reliance)

టెలిక్ం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన అత్యంత చవక స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్’ (JioPhone Next Pre-Bookings) ముందస్తు బుకింగులు వచ్చే వారం నుంచి మొదలు కానున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. సెప్టెంబరు 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. జియోఫోన్ నెక్స్ట్‌ను (JioPhone Next) రియల్స్ జియో, గూగుల్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దేశంలో ఇంకా ఫీచర్‌ ఫోన్‌కే పరిమితమైన కోట్లాదిమందికి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ ఫోన్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

జియో నెక్స్ట్‌ ప్రి బుకింగ్స్ (JioPhone Next pre-booking in India) వచ్చే వారం ప్రారంభం కానున్నట్టు జియో వర్గాల ద్వారా తెలుస్తోంది. ముందస్తు బుకింగుల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్టు జియో పేర్కొంది. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇది అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ కాబోతోందని టెలికం వర్గాలు చెబుతున్నాయి. జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఈఫోన్‌ ఫీచర్లు, కాస్ట్‌ ఎంత అనే అంశాలపై ఇప్పటికే సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు మొబైల్‌మార్కెట్‌ ఎక్స్‌ప‌ర్ట్స్‌ దృవీకరించారు.

భారత్ నుంచి సొంత కరెన్సీ, డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ రూపీ ట్రయిల్స్‌ ప్రారంభిస్తామని తెలిపిన రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్), 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ క్యూఎం215 ఎస్ఓసీ, 2జీబీ/3జీబీ ర్యామ్ వేరియంట్లు, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ ఆప్షన్లు, వెనకవైపు 13 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ వి4.2, జీపీఎస్ కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ఏప్రిల్‌-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల యూజర్లతో ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్‌ టెల్‌ , 119.63 మిలియన్లతో వొడాఫోన్‌ - ఐడియా, 16.44 మిలియన్‌ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్‌ చేస్తుంది. దీంతో రూరల్‌ ఇండియాని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్‌ లో విడుదల చేయనుంది.