Shri Ramayana Yatra: దేఖో అప్నా దేశ్, రామాయణ యాత్రకు వెళ్లే భక్తులకు స్పెషల్ టూరిస్ట్ ట్రైన్, 17 రోజుల పాటు యాత్ర, నవంబర్ ఏడో తేదీన ప్రారంభం
శ్రీ రామాయణ్ యాత్ర పేరుతో డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తోంది.
Dekho Apna Desh: దేఖో అప్నా దేశ్ అనే పేరుతో కేంద్రం చేపట్టిన తొలి అడుగులో భాగంగా భారతీయ రైల్వేస్ శ్రీ రామాయణ యాత్రకు (Shri Ramayan Yatra) వెళ్లే భక్తుల కోసం స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ సేవలను ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. శ్రీ రామాయణ్ యాత్ర పేరుతో డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తోంది. 17 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో (IRCTC launches 17-day Shri Ramayan Yatra) భక్తులు దేశంలోని అనేక అధ్యాత్మిక కేంద్రాలను సందర్శించవచ్చు.
నవంబర్ ఏడో తేదీన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి రామాయణ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో పాల్గొనే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో తమ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులంతా కోవిడ్-19 రెండు డోస్‌లు వేసుకున్న సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈ యాత్రలో ప్రయాణికులు సుమారు 7,500 కి.మీ. దూరం ప్రయాణిస్తారు.
ఇదీ పర్యటన రూట్ : రామాయణ ఎక్స్ ప్రెస్ రైలు ఫస్ట్ స్టాప్ అయోధ్యలో ఉంటుంది. అక్కడి శ్రీరామ జన్మభూమి టెంపుల్, హునుమాన్ టెంపుల్‌ను, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్‌ను సందర్శించొచ్చు. అక్కడ నుంచి బీహార్‌లోని సీతామర్హికి వెళుతుంది. సీతా మర్హిలో సీత జన్మస్థలం, నేపాల్‌లోని జనక్‌పూర్‌లో రాం-జానకి టెంపుల్‌ను సందర్శిస్తారు. సీతామర్హి తర్వాత వారణాసికి వెళుతుంది ఈ ఎక్స్‌ప్రెస్ రైలు. వారణాసి, ప్రయాగ్, శృంగవేర్పూర్ ఆలయాలను సందర్శించవచ్చు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో చిత్రకూట్ వెళ్లొచ్చు. ఈ నాలుగు కేంద్రాల్లో రాత్రి బస ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి నాసిక్, హంపి మీదుగా రామేశ్వరానికి రామాయణ ఎక్స్ ప్రెస్ రైలు చేరుకుంటుంది.
Here's ANI Tweet
సందర్శించే ఆధ్యాత్మిక కేంద్రాలివే:
అయోధ్య: రామజన్మభూమి దేవాలయం, హనుమాన్ గఢీ, సరయు ఘాట్
నందిగ్రామ్: భారత్-హనుమాన్ టెంపుల్, భారత్ కుంద్
జనక్ పూర్: రామ్ జనక్ మందిర్
సీతా మర్హి: సీతామర్హిలోని జానకి మందిర్, పునౌరా ధామ్
వారణాసి: తులసి మానస్ టెంపుల్, సంకట్ మోచన్ టెంపు, విశ్వనాథ్ టెంపుల్, సీతా సామాహిత్ స్థల్, సీతామర్హిలోని సీతా మాతా టెంపుల్.
ప్రయాగ్: భరద్వాజ్ ఆశ్రమం, గంగా యమున సంగమం, హనుమాన్ దేవాలయం
శ్రీంగవేర్పూర్: శ్రింఘే రిషి సమాధి అండ్ శాంతాదేవి టెంపుల్, రామ్ చౌరా
చిత్రకూట్: గుప్త గోదావరి, రామ్‌ఘాట్, భారత్ మిలాప్ టెంపుల్, సతి అనసూయ టెంపుల్
నాసిక్: త్రయంబకేశ్వర్ టెంపుల్, పంచవటి, సీతా గుఫా, కలరామ్ టెంపుల్
హంపి: అంజనాద్రి హిల్, రిషిముఖ్ ఐలాండ్, సుగ్రీవ గుహ, చింతామణి టెంపుల్, మాల్యవంత రఘునాథ్ టెంపుల్.
రామేశ్వరం: శివ టెంపుల్, ధనుస్కోటి
ప్యాకేజీలు..
ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, మరో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్‌ల్లో బస చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల నుంచి ఆన్ బోర్డ్ వెజిటేరియన్ భోజన వసతి కల్పిస్తారు. ఏసీ వాహనాల్లోనూ ఆయా ప్రదేశాలను సందర్శించ వచ్చు. ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తారు.
టికెట్ ధరలు
1AC : సింగిల్ : రూ. 1,12955, ట్విన్స్ : రూ. 1,02095, ముగ్గురయితే, రూ. 1,02, 095, పిల్లలు బెడ్ అయితే రూ. 93,385, పిల్లలకు బెడ్ లేకుండా అయితే రూ. 91,185
2AC : సింగిల్ : రూ. 93,810, ట్విన్స్ : రూ. 82,950, ముగ్గురయితే, రూ. 82,950, పిల్లలు బెడ్ అయితే రూ. 74,185, పిల్లలకు బెడ్ లేకుండా అయితే రూ. 72,140