South Central Railway: ఏపీలో 23 రైల్వే స్టేషన్లు మూసివేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, మూసివేసిన స్టేషన్ల పూర్తి వివరాలు ఇవిగో..

విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

IRCTC (Photo-ANI)

దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 23 స్టేషన్లు మూతపడ్డాయి. ఇప్పటికే ఈ స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని చాలా వరకు ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేశారు.

కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్‌ నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. రవాణా సాధనాలు పెరగడం, రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్‌ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో మూసివేయక తప్పడం లేదని రైల్వేశాఖ తెలిపింది.

ఆధార్‌కు పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరు ఆధార్-పాన్ కార్డ్ లింక్‌ చేయనవసరం లేదో ఓ సారి తెలుసుకోండి

మే 1వ తేదీ విజయవాడ డివిజన్‌ పరిధిలోని ఎన్‌ఎస్‌జీ–6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రా‹ఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో గత మే నెల 1న 16 స్టేషన్లను మూసివేస్తూ రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది. అల్లూరు రోడ్డు స్టేషన, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద్‌, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద్ద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవేంకటేశ్వరాపురం, తలమంచి, తెలప్రోలు, వట్లూరు స్టేషన్లను క్లోజ్‌ చేశారు. అక్కడి సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నెల 1 నుంచి కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్లు స్టేషన్లను కూడా ఎత్తేశారు.