PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్, పాన్ కార్డు బ్లాక్, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.10వేల వరకు జరిమానా, వెంటనే ఈ వివరాల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి
ఒకవేళ మీరు ఇప్పటికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖరు వరకు ఆధార్-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ కార్డు (PAN Card) కు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. ఒకవేళ మీరు ఇప్పటికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖరు వరకు ఆధార్-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు లింక్ చేయకుంటే ..ఆదాయం పన్నుశాఖ పోర్టల్‌లోకి వెళ్లి మీరే తేలిగ్గా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసేయొచ్చు. అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే PAN - Aadhaar అనుసంధానం తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ఆధార్- పాన్ కార్డ్ లింకింగ్ ప్రాసెస్ దశల వారీగా ఎలాగో తెలుసుకుందాం.. !
ముందు ఇన్‌కం టాక్స్ ( Income Tax ) వెబ్‌సైట్‌కి వెళ్లాలి. లింక్ ఇదే.. https://www.incometax.gov.in. అందులో ఆధార్ లింక్ అని ఉన్నచోట క్విక్ లింక్ చేయాలి. తర్వాత పాన్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఒకవేళ పాన్-ఆధార్ లింక్ లేకపోతే ఫీజు చెల్లింపు కోసం మీరు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ( NSDL website) కు వెళ్లాలి. అక్కడ చలాన్ నంబర్ / ఐటీఎన్ఎస్ 280 పై ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అప్పుడు టాక్స్ అప్లికబుల్ ( Tax applicable ) (0021) ఆదాయం పన్ను పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత పేమెంట్ (500) కోసం ఇతర చెల్లింపులు ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అందులో మీకు పేమెంట్ కోసం రెండు ఆప్షన్లు లభ్యం అవుతాయి.. అవి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు. మీ వెసులుబాటును బట్టి ఆ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. డెబిట్ కార్డ్ వివరాలు గానీ, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వార్డ్ గానీ రిజిస్టర్ చేయాలి. పర్మనెంట్ అకౌంట్ నంబర్‌లో పాన్ నంబర్ నమోదు చేయాలి. అసెస్‌మెంట్ ఇయర్‌లో 2023-2024ను సెలెక్ట్ చేయాలి. చిరునామా ఆప్షన్ వద్ద మీ అడ్రస్ నమోదు చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ ( captcha code ) రిజిస్టర్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు నమోదు చేసిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.స్క్రీన్ మీద కనిపించే సమాచారాన్ని చెక్ చేశాక.. ఐ అగ్రీ ( I Agree ) అని టిక్ చేసి బ్యాంకుకు సబ్‌మిట్ కొట్టాలి.
మీరు నమోదు చేసిన సమాచారంలో ఏమైనా తేడాల ఉంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి.. డేటా సరి చేసుకోవాలి. డెబిట్ కార్డ్ వివరాలు గానీ, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వార్డ్ గానీ రిజిస్టర్ చేయాలి. పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30 వరకు రూ.500 చెల్లించాలి. జూన్ 30 తర్వాత రూ.1000 ఫైన్ చెల్లించాలి.ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు పీడీఎఫ్ లభిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని జాగ్రత్త పర్చుకోవాలి. పాన్-ఆధార్ అనుసంధానానికి జరిపిన చెల్లింపులు అప్‌డేట్ కావడానికి 4-5 రోజుల టైం పడుతుంది. 4-5 రోజుల తర్వాత మీరు మళ్లీ ఆధార్, పాన్ నంబర్ రిజిస్టర్ చేసి వాలిడేట్ ( Validate ) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీ పేమెంట్ అప్‌డేట్ అయితే స్క్రీన్‌పై కంటిన్యూ ఆప్షన్ వస్తుంది.
కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేశాక.. వచ్చే కొత్త పేజీలో ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఆధార్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తదుపరి ఐ అగ్రీ ( I Agree ) టిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి వాలిడేట్ ( Validate ) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు పాప్అప్ విండో ( pop up window ) ఓపెన్ అవుతుంది. మీ ఆధార్- పాన్ కార్డ్ లింకింగ్‌ను విశిష్ట ప్రాధికార సంస్థ ( UIDAI ) ఆమోదానికి పంపామని పాప్అప్ విండో చెబుతుంది. విశిష్ట ప్రాధికార సంస్థ ఆమోదం తర్వాత మీ పాన్-ఆధార్ నంబర్‌లు అనుసంధానం అవుతాయి. అప్పుడు ఇన్‌కం టాక్స్ వెబ్‌సైట్‌పై మీ ఆధార్-పాన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
పాన్ కార్డుతో ఆధార్ అనుధానం కోసం ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆధార్, పాన్ కార్డు.. రెండింటిలో వివరాలు సరిపోలితేనే అనుసంధానం అవుతుంది. ఒకవేళ పేరు, పుట్టిన తేదీ వివరాలు విభిన్నంగా ఉంటే లింక్ కాదు. అందుకే వివరాలు మ్యాచ్ కాకపోతే.. సవరణ చేయించుకొని.. అనుసంధానం చేసుకోవాలి.