New Delhi Feb 06: అన్నింటికీ ఆధార్ (Aadhar) ఆధారమైపోయింది. A4 సైజులో ఉండే ఆధార్ కార్డును ప్రతీ చోటకు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారింది. పోనీ కార్డును ల్యామినేషన్ చేయించి పర్సులో పెట్టుకుందామటే...అది కూడా త్వరగా పాడవుతుంది. ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం పీవీసీ ఆధార్ కార్డు (Aadhaar PVC Cards). ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఆధార్ పాలీవినైల్ క్లోరైడ్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ (Mobile Number Link) చేయకపోవడం వల్ల చాలా మంది ఇవి తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా పీవీసీ ఆధార్ కార్డులకు ఆర్డర్ చేయవచ్చని యూఐడీఏఐ (UIDAI) తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్ నంబర్‌తో అయినా పీవీసీ కార్డు (PVC Card) కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. అంతే కాకుండా ఒకే ఫోన్ నంబర్‌తో కుటుంబం మొత్తానికి పీవీసీ కార్డుల కోసం ఆర్డర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
పీవీసీ కార్డు కోసం దరఖాస్తు ఇలా...
1. ఆధార్ అధికారిక వెబ్‌సైట్ www.uidai. gov.in లేదా www.resident. uidai.gov.in ఓపెన్ చేయాలి.
2. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
3. మొబైల్ నంబర్ ఎంటర్ (Mobile number)చేయాలి. టైమ్ బేస్డ్ వన్ టైమ్ పాస్‌వర్డ్ (TOTP)పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సెక్యూరిటీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి.
4. ఆధార్ వివరాలను సరిచూసుకొని ధ్రువీకరించుకోవాలి. తర్వాత ప్రింటింగ్‌కు ఆర్డర్ ఇవ్వాలి. ఒక్కో కార్డు ప్రింటింగ్‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.