Bank Complaints: ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా ఇలా చేయండి !
లింక్ కోసం ఇక్కడ చూడొచ్చు...
ఈ మధ్యకాలంలో బ్యాంకులపై ఫిర్యాదులు (Bank Complaints) ఎక్కువైపోతున్నాయి, మన డబ్బును మనం తీసుకోవడానికి కూడా బ్యాంకులు ఎన్నో షరతులు విధిస్తాయి. నగదు లావాదేవీలు జరిపేటపుడు అందులో ఏవైనా తప్పులు దొర్లితే సదరు బ్యాంకు అధికారులతో సంప్రదించినా వారి నుంచి సరైన స్పందన రాదు, ఇక ఫైనాన్స్ సంస్థల గురించి పెద్దగా చెప్పాల్సిన పనేలేదు. దీంతో కస్టమర్లకు బ్యాంకింగ్ వ్యవస్థపైనే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
అయితే వీటన్నింటికి పరిష్కారం దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank of India) జూన్ 24, 2019న ఒక ఆన్‌లైన్ పోర్టల్ ను ప్రారంభించింది.
ఏదైనా బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (NBFC) సంస్థలపై ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా మీ మొబైల్ నుంచి లేదా డెస్క్ టాప్ నుంచి ఆర్బీఐ (RBI) కు సంబంధించిన CMS (Complaint Management System) లో ఎంటర్ అయి File a Complaint ఎంచుకొని మీరు ఏదైతే బ్యాంకుపై కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన వివరాలన్ని నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Link- https://cms.rbi.org.in/cms/IndexPage.aspx?aspxerrorpath=/cms/cms/indexpage.aspx
మీ ఫిర్యాదు నేరుగా ఆ బ్యాంకుకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించే శాఖ Ombudsman కులేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి (Regional Office of RBI) రీడైరెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ Ombudsman ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే File an appeal ఆప్షన్ ఎంచుకొని దానిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఒకసారి మీరు ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మీ ఫోన్ కు మెసేజ్ (Text Message) లేదా ఈమెయిల్ (email) ద్వారా తెలియజేస్తారు. మీరు చేసిన కంప్లైంట్ ఎంతవరకు వచ్చిందో Track your complaint ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.
బ్యాంకుకు సంబంధించి ఎంత చిన్న విషయమైనా లేదా పెద్ద విషయమైనా ఫిర్యాదు చేయవచ్చు. వీటన్నింటిని పరిశీలించి ఆయా బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేస్తుంది.