Salt And Sugar Contain Microplastics:షాకింగ్..మీరు వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్, సంచలన నివేదిక, ఒక్కసారి ఆలోచించండి?
ఈ రెండు ప్రతీ మనిషి జీవితంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాల్సిందే. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది.
August 13: వంటింట్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనవి ఒకటి ఉప్పు, మరొకటి చక్కెర. ఈ రెండు ప్రతీ మనిషి జీవితంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాల్సిందే. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది.
పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్ అనే పేరుతో దేశంలోని 10 రకాల ఉప్పుపై పరీక్ష నిర్వహించగా టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి వాటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు.
ఫైబర్, గుళికలు, శకలాలు వంటివి ఉప్పు మరియు చక్కెర నమూనాలలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఈ మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణం 0.1 మిమీ నుండి 5 మిమీ వరకు ఉంటుందని తెలిపింది. టాక్సిక్స్ లింక్ వ్యవస్థాపకుడు-డైరెక్టర్ రవి అగర్వాల్ మాట్లాడుతూ..మా అధ్యయనం యొక్క లక్ష్యం మైక్రోప్లాస్టిక్స్‌పై ఇప్పటికే ఉన్న సైంటిఫిక్ డేటాబేస్‌కు సహకరించడం తద్వారా ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం కోసమేనని వెల్లడించారు.
కేజీ ఉప్పులో 6.71 నుండి 89.15 గ్రాముల వరకు మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రత ఉన్నట్లు గుర్తించామని నివేదిక వెల్లడించడం అందరిని షాక్‌కు గురిచేసింది. అలాగే
అయోడైజ్డ్ ఉప్పులో అత్యధికంగా మైక్రోప్లాస్టిక్‌లు (కిలోగ్రాముకు 89.15 ముక్కలు) ఉండగా, ఆర్గానిక్ రాక్ సాల్ట్‌లో అత్యల్పంగా (కిలోగ్రాముకు 6.70 ముక్కలు) ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. చక్కెర నమూనాలలో, మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రత కిలోగ్రాముకు 11.85 నుండి 68.25 ముక్కల వరకు ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
మైక్రోప్లాస్టిక్‌లు ఆరోగ్యంపైనే కాదు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు ఆహారం, నీరు మరియు గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి.
తద్వారా ఊపిరితిత్తులు, గుండె పై ప్రభావం చూపుతాయి. అలాగే మానవ అవయవాలపై, తల్లి పాలు మరియు పుట్టబోయే పిల్లలపై ఎఫెక్ట్ చూపుతాయని అధ్యయనంలో తేలింది. సగటు భారతీయుడు ప్రతిరోజూ 10.98 గ్రాముల ఉప్పు మరియు 10 స్పూన్ల చక్కెరను వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది.