SBI Services Fee: సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.346 కోట్లు పిండేసిన ఎస్‌బీఐ, ఆ ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో(services fee) వసూలు చేసింది ఎస్‌బీఐ(SBI).

Image used for representational purpose.| Photo: Wikimedia Commons

New Delhi December 15: సర్వీస్‌ ఫీజు పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేసింది. 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో(services fee) వసూలు చేసింది ఎస్‌బీఐ(SBI). ఉచిత సేవలకు మించి వినియోగదారులు అదనపు సేవలను (additional services) వినియోగించినందుకు 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ₹345.84 కోట్లను ఎస్‌బీఐ వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి భగవత్ కరద్(Minister of State for Finance Bhagwat Karad ) రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

SBI Debit Card: మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆగస్టు 30, 2020 నాటి సీబీడీటీ(CBDT) మార్గదర్శకాల ప్రకారం.. రూపే డెబిట్ కార్డు(RuPay debit card), యుపీఐ(UPI), యుపీఐ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్ మోడ్(UPI QR code) లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత సేకరించిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, భవిష్యత్తు లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని బ్యాంకులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY) కింద తెరిచిన ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(BSBDA) తెరిచిన వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. అలాగే, వీరు బ్యాంకు ఖాతాలలో ఎలాంటి కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం లేదు.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు ఏటీఎం ద్వారా నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్‌ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్‌లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్‌బీడీఏ, ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి.