South Central Railway: రైళ్లపై రాళ్ల దాడులు చేస్తే ఐదేండ్ల జైలు శిక్ష, దుండగులకు వార్నింగ్ ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే
కాజీపేట్-ఖమ్మం, కాజీపేట్-బోంగీర్, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందన్నారు.
ఇటీవల రైళ్లపై రాళ్ల దాడులు పదే పదే జరుగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఎవరైనా రైళ్లపై రాళ్లు విసిరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది దక్షణి మధ్య రైల్వేశాఖ. రైలు ప్రయాణించే సమయంలో రాళ్లు విసరడం వంటి చర్యల వల్ల ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్‌సీఆర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిణామాలు ఇటీవల పదే పదే జరుగుతున్నాయని తెలిపారు.
విశాఖలో వందేభారత్ రైలుపై ఆగంతకులు రాళ్ల దాడి, రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసం
దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఐదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట్-ఖమ్మం, కాజీపేట్-బోంగీర్, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందన్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరంలోనే తొమ్మిది ఘటనలు చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే అధికారులు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి... మూడు గంటల ఆలస్యం.. వీడియోతో
విశాఖ సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే జనవరిలో రాళ్ల దాడి జరిగింది. మెయింటెనెన్స్ సమయంలో విశాఖ కంచరపాలెం సమీపంలో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ గ్లాస్ పేన్ దెబ్బతింది.ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.ఫిబ్రవరిలో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో.. సీ-12 కోచ్ (చైర్ కార్ కోచ్) విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.