Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఈ నెల 17 వరకు పలు రైళ్లు రద్దు, 34 ఎంఎంటీఎస్ రైళ్లు, 15 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది.
Hyd, July 14: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది. ఇందులో జంట నగరాల్లో నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లు, 15 రైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – ఉందానగర్- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైళ్లను రద్దు చేశారు. శాంతించని వరుణుడు, నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు, 12 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని తెలిపిన సీఎం కేసీఆర్
ఇక కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో కాకినాడ పోర్టు- విశాఖపట్నం మెమోరైలు, విజయవాడ-బిట్రగుంట మొము రైలు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్ రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపలల్ి రూట్లో మరో 9, ఫలక్ నుమా -లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి -ఫలక్ నుమా రూట్లో 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒకటి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒకటి చొప్పున రద్దు చేశారు.