Indian Railways: విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–నర్సాపూర్ (06549) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5న ఉదయం 11.20 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06550) ఈ నెల 6న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు చేరుకుంటుంది.
- అలాగే, సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–నర్సాపూర్ (06521)రైలు ఈ నెల 3న ఉదయం 11.20 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06522) ఈ నెల 4న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు చేరుకుంటుంది.
- సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–కాచిగూడ(06523) ఈ నెల 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06524) ఈ నెల 4, 6 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరుకు చేరుకుంటుంది