Monkeypox Now Mpox: మంకీపాక్స్‌ కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘ఎంపాక్స్’గా పేరు మార్పు.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్‌కు కొత్త పేరు వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును డబ్ల్యూహెచ్ఓ ‘ఎంపాక్స్’గా మార్చింది.

Monkeypox (File: Facebook)

Newyork, Nov 29: భారత్ (India) సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్‌ (Monkeypox)కు కొత్త పేరు (New Name) వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’ (Mpox)గా డబ్ల్యూహెచ్ఓ (WHO) మార్చింది. ప్రపంచ నిపుణులతో పలు సంప్రదింపుల తర్వాత ఈ పేరును ప్రకటించింది. మంకీపాక్స్, ఎంపాక్స్ అనే పేర్లు ఏడాది పాటు ఉపయోగంలో ఉంటాయని, ఆ తర్వాత మంకీపాక్స్ అనే పేరు కనుమరుగవుతుందని వివరించింది.

నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!

ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాపించినప్పుడు ఆన్‌లైన్, ఇతర సెట్టింగులు, కొన్ని కమ్యూనిటీల్లో జాత్యహంకార, కళంకం కలిగించే భాషను ఉపయోగించడాన్ని గుర్తించి ఆ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. ఆ తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేశాయి.

పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం.. హైదరాబాద్ లో ఘటన

జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓను కోరాయి. దీంతో పలు పరిశీలనలు చేసిన సంస్థ చివరికి ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!

Reign Of Titans: భారత్‌లో ఇకపై ఆ గేమ్‌ ఆడొచ్చు, అన్ని అడ్డంకులను అధిగమించిన రీన్స్‌ ఆఫ‌ టైటాన్స్, అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనవచ్చని సంస్థ ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement