
New Delhi, JAN 24: ప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది. దీంతో స్ట్రాటర్జీ కార్డ్ బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రీన్ టైటాన్ గేమ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడవచ్చు. తక్కువ టెక్నికల్ రిక్వైర్‌మెంట్లతో గ్లోబల్ కాంపిటీషన్లలోనూ పాల్గొన వచ్చు. ‘భారత్‌పై రీన్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) ప్రభావం ఉంటుంది’ అని రీన్ ఆఫ్ టైటాన్స్ హెడ్ అది అబిలీ చెప్పారు. ‘యూజర్లకు మా గేమ్ బెస్ట్ వర్షన్ అందించడానికి మేం గణనీయ సమయం కేటాయించడంతోపాటు కృషి చేశాం. ఈ-స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలని భావించే ఆటగాళ్లకు కొత్త అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరికీ సరదా అందిస్తుంది’అని అన్నారు.
Viral Video: అంగారక గ్రహంపై రాత్రి పూట నక్షత్రాల వెలుగులు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్
రీన్ ఆఫ్ టైటాన్స్ తన ప్లేయర్లను ఆధ్యాత్మికమైన, మనోహరమైన ప్రదేశం ‘ఎరియో’కు తీసుకెళుతుంది. ప్లేయర్లు లేదా క్యోక్స్ గేమ్‌లోకి ఎంటరయ్యే ముందు ఎనిమిది ఎలిమెంట్స్‌లో ఒక టైటాన్‌ను ఎంచుకుని తమ డెక్ స్క్రోల్స్ నిర్మించుకుని ఎరినా వైపు దూసుకెళ్తారు. ఈ రియల్‌టైం 1వర్సెస్ 1 మ్యాచెస్‌లో ఆటగాళ్లు తమ టైటాన్ ఎనర్జీని సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గేమ్‌లో రెండు మార్గాల్లో విజయం సాధించొచ్చు. ప్రత్యర్థిని క్షీణింపజేసి గానీ, వారిని స్క్రోల్స్ నుంచి రన్‌ఔట్ అయ్యేలా చేసి గానీ విజయం సాధించొచ్చు. రీన్ ఆఫ్ టైటాన్స్ గేమ్ దేశంలో కొత్త కాదు. కాలేజీలు, గేమింగ్ కేఫ్‌లు, టాప్ ఈ-స్పోర్ట్స్ అథ్లెట్లకు గతేడాదే అందుబాటులోకి తీసుకొచ్చింది రీన్ ఆఫ్ టైటాన్స్ టీం.
Latest News: రూ.1.71 లక్షల కోట్లు తగ్గిన టాప్ కంపెనీల MCAP.. వెనుకబడ్డ ఇన్ఫోసిస్, టీసీఎస్
రీన్ ఆఫ్ టైటాన్స్ లో సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ ఎవరినైనా ఈ-స్పోర్ట్స్ ప్లేయర్ చేయడానికి, గ్లోబల్ లీడర్‌బోర్డులపైకి దూసుకెళ్లడానికి చాలా ఈజీగా ఉపకరిస్తాయి. ఆసక్తి గల ప్లేయర్లు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ ఆప్‌స్టోర్‌కెళ్లి రీన్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) యాప్ డౌన్‌లోన్ చేసుకుంటారు. దీంతో వారికి ఫస్ట్ టైటాన్ లభించడంతోపాటు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటారు. ‘వెల్‌కం లూట్ బాక్స్ (Welcome Loot Box)’ పట్ల కొత్త ప్లేయర్లు ఆసక్తిగా ఉంటారు. టైటాన్‌లో తమ వ్యూహం ఖరారు చేసుకునేందుకు కొత్త ప్రారంభం మొదలవుతుంది. భారత్‌లోని ఆటగాళ్లు రీన్ ఆఫ్ టైటాన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి వెళ్లి వచ్చే ఈవెంట్లు, రీన్ ఆఫ్ టైటాన్స్ ప్రత్యక్ష ప్రసారం అనుభవాలు తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలేజీలు, నగరాల పరిధిలో ఈ గేమ్ యాక్టివేషన్ కొనసాగుతుంది.