మార్స్‌ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాల వెలుగులతో జిగేల్ మంటోంది. సాధారణంగా భూమిపై మనం వాడే విద్యుద్దీపాల వెలుతురు కారణంగా ఆకాశం సరిగా కనిపించదు. అందువల్ల చాలామంది కొండలు, గుట్టల ప్రాంతాలకు వెళ్లి ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటారు.అయితే అంగారకుడిపై ఈ సమస్య లేదు.

ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన వి నారాయణన్

పైగా భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అందువల్ల అంతరిక్షం నుంచి వచ్చే వెలుగు నేరుగా ప్రసరిస్తూ ఉంటుంది. దీనితో అంగారకుడిపై రాత్రిపూట కూడా కొంత మేర వెలుతురు కనిపిస్తుంది. నక్షత్రాలు అయితే మరింత స్పష్టంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా కనిపిస్తున్న వీడియోలో నక్షత్రాలు మరింత స్పష్టంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కనిపించడం వల్ల అక్కడ రాత్రి కూడా పగలు మాదిరిగానే కనిపిస్తోంది.

 Night on Mars 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)