భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్‌లో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 59 ఏళ్ల వయసులో స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా గురువారం తన మూడో అంతరిక్షయానానికి సునీతా విలియమ్స్ బయలుదేరిన విషయం తెలిసిందే. ఓ రోజు ప్రయాణం తర్వాత శుక్రవారం నాడు స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు సక్సెస్‌ఫుల్‌గా డాక్ అయింది. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సునీతా విలియమ్స్ డాన్స్ చేస్తూ కనిపించారు. స్టార్‌లైనర్ షిప్ నుంచి ఐఎస్ఎస్‌లోకి ఎంటర్ అయిన సందర్భంలో మిగిలిన ఆస్ట్రోనాట్‌తో తన ఆనందాన్ని పంచుకున్న ఆమె.. అక్కడే డ్యాన్స్ కూడా చేశారు. 58 ఏళ్ల వయసులో అంతరిక్షానికి.. చరిత్ర సృష్టించిన సునీతా విలియమ్స్
That feeling when you're back on the station! 🕺
@NASA_Astronauts Butch Wilmore and Suni Williams are greeted by the @Space_Station crew after @BoeingSpace #Starliner's first crewed journey from Earth. pic.twitter.com/fewKjIi8u0
— NASA (@NASA) June 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)