సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది. అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని లైవ్ లో చూపించింది. గ్రహణ కాలంలో నార్త్ అమెరికాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చీకట్లు కమ్మేసిన దృశ్యాలను కెమెరాలో బంధించింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు ఈ వీడియోను పంపించగా.. నాసా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాసా ట్వీట్ చేసిన సూర్యగ్రహణం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ 2044 లోనే అమెరికాలో కనిపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలంటే 2046 లోనే సాధ్యమని నాసా వెల్లడించడంతో జనాలలో ఆసక్తి పెరిగింది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)