![](https://test1.latestly.com/wp-content/uploads/2022/11/roja1.jpg)
Vijayawada, Nov 29: ఏపీ మంత్రి (AP Minister) రోజా (Roja) కబడ్డీ (Kabaddi) ఆడుతూ కిందపడిపోయారు. వివరాల్లోకి వెళ్తే, నగరి డిగ్రీ కాలేజీలో (Nagari Degree College) క్రీడా సంబరాలను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు క్రీడలను ఆడి అలరించారు.
పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం.. హైదరాబాద్ లో ఘటన
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడారు. విద్యార్థినులను ఆమె ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లారు. అవతలి జట్టులో ఉన్న అమ్మాయిలు రోజాను టాకిల్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె వెల్లికిలా కిందకు పడిపోయారు (Felldown). దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అలా కిందపడేస్తారా? అంటూ అధికారులు, ఆమె అనుచరులు విద్యార్థినులను అంటుండగా... రోజా కలగజేసుకుని ఎవరినీ ఏమనొద్దని వారించారు. అంతేకాదు, స్పోర్టివ్ స్పిరిట్ తో ఆమె మరో రెయిడ్ కు కూడా వెళ్లారు. అమ్మాయిలను రోజా ప్రోత్సహించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.