Ragging Terror In Assam: ర్యాంగింగ్‌కు భయపడి రెండో అంతస్తు నుంచి దూకిన యూనివర్సిటీ విద్యార్థి.. విషమంగా పరిస్థితి.. మాజీ విద్యార్థి సహా ఐదుగురి అరెస్ట్..  నాలుగు నెలలుగా వేధిస్తున్న సీనియర్లు
Anand Sharma (Credits: Twitter/ANI)

Dispur, Nov 29: ర్యాగింగ్ (Ragging) భూతం ఓ విద్యార్థి (Student) నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. అసోంలోని (Assam) దిగ్రూగఢ్ యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు భయపడిన ఆనంద్ శర్మ (Anand Sharma) అనే విద్యార్థి వారి బారి నుంచి తప్పించుకునేందుకు హాస్టల్ భవనంలోని (Hostel Building) రెండో అంతస్తు (Second Floor) నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి (Hospital) తరలించారు.  ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆనంద్‌ను ర్యాగింగ్ చేసినట్టుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు

సీనియర్ విద్యార్థులు తన కుమారుడిని నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనంద్ శర్మ తల్లి పేర్కొన్నారు. తన కుమారుడి నుంచి డబ్బులు, మొబైల్ లాక్కుని హింసించేవారని, మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, ఆపై వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించే వారని ఆరోపించారు. ఆనంద్ తనకు ఫోన్ చేసి హాస్టల్‌కు వెళ్తున్నానని, సీనియర్ విద్యార్థులు రాత్రంతా తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడని చెప్పారు. వారి ర్యాగింగ్ కారణంగా తన కుమారుడి కాలు విరిగిందని, ఛాతీపై గాయమైందన్నారు.

2023 డిసెంబ‌ర్ నాటికి యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ పూర్తి చేయాలి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని జెన్‌కోకు సూచించిన సీఎం కేసీఆర్

దిబ్రూగఢ్ యూనివర్సిటీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. నిందితులను వదిలిపెట్టబోమన్న సీఎం.. బాధిత విద్యార్థికి చికిత్స కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితుల్లో రాహుల్ చెత్రీ అనే మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు.