Chicken Curry (Credits: Facebook)

Hyderabad, Nov 29: చికెన్ (Chicken) కోసం ఓ పెళ్లినే (Marriage) నిలిపేశారు. హైదరాబాద్ (Hyderabad) జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది.

ర్యాంగింగ్‌కు భయపడి రెండో అంతస్తు నుంచి దూకిన యూనివర్సిటీ విద్యార్థి.. విషమంగా పరిస్థితి.. మాజీ విద్యార్థి సహా ఐదుగురి అరెస్ట్.. నాలుగు నెలలుగా వేధిస్తున్న సీనియర్లు

షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌ (Function Hall)లో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు (Feast) ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు. విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు.

ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు

అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు (బుధవారం) వివాహం జరిపించాలని నిర్ణయించారు.