BRS Working President KTR for Delhi, to meet supreme court lawyers(X)

Delhi, Feb 5:  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరగా దీనికి కొంత సమయం కావాలని కోరారు ఎమ్మెల్యేలు. దీంతో ఉప ఎన్నికలు వస్తాయా అన్న సందేహం అందరిలో నెలకొంది.

ఇక ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు(Party Change MLAs) కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR Delhi Tour Updates) ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదులతో భేటీ కానున్నారు కేటీఆర్.  వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మూడు రోజులు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉండగా కేటీఆర్‌తో పాటు ఢిల్లీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, దాసోజు శ్రవణ్‌ తదితర నేతలు వెళ్లనున్నారు. ఈ కేసులో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని కేటీఆర్ ధీమాతో ఉండటమే కాదు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సైతం సూచించారు.