Layoffs In Tech Companies: మొన్న ట్విట్టర్, మెటా, నిన్న లైఫ్ట్, ఫిన్ టెక్, అమెజాన్, నేడు జొమాటో.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు? మరో ఆర్ధిక మాంద్యానికి ఇది సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు??

ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాటపట్టింది. తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది.

Layoff | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Nov 22: దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్ (Twitter), మెటా (Meta), అమెజాన్ (Amazon) లైఫ్ట్, ఫిన్ టెక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో (Zomato) కూడా అదే బాటపట్టింది. తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో తొలగిస్తోంది. మరోవైపు జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 4.5 సంవత్సరాలుగా కంపెనీలో పని చేస్తున్నాడు. జొమాటో ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఏకంగా 520 మంది సిబ్బందిని తొలగించింది. అంటే ఒకేసారి 13 శాతం మంది ఉద్యోగుల్ని తీసేసింది. అప్పట్లో కంపెనీ నష్టాల్లో ఉండటం, వ్యాపారం సరిగ్గా సాగకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లోనూ ముమ్మరంగా సోదాలు.. ఒకేసారి 50 బృందాలతో సోదాలు

ఎందుకు తొలగిస్తున్నారు?

టెక్ కంపెనీలు ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి గల కారణాలను నిపుణులు (Experts) విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో (Global Markets) ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కంపెనీల భవిష్యత్తుపై పడకుండా ఉండటానికి వేతన భారాన్ని తగ్గించుకోవడానికి, ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు కుదిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రానున్న మరికొన్ని వారాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

కొలంబియాలో ఇండ్లపై కూలిన విమానం.. పెద్దయెత్తున మంటలు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

ఈ పరిస్థితికి కారణమేంటి?

కరోనా ప్రతీ ఒక్కరి జీవితాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థికంగా చితికిపోయిన మెజారిటీ ప్రజలు కొనుగోళ్లపై ఆసక్తి కనబర్చలేదు. దీంతో తయారీ కంపెనీలతో పాటు పరోక్షంగా సేవా కంపెనీలపై ప్రభావం పడింది. ఇదే ప్రస్తుత పరిస్థితికి కారణమని కొలంబియా బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాన్ వాంగ్ అన్నారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు మార్కెటింగ్, ప్రకటనలపై వెచ్చించే మొత్తాన్ని కూడా కంపెనీలు తగ్గించుకుంటున్నట్టు  వెల్లడించారు.  పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీల్లో కూడా ఉద్యోగుల కోత మొదలైందని మెన్లో వెంచర్స్ పార్టనర్ మట్ మర్ఫీ తెలిపారు.

ఇప్పుడు కంపెనీలు ఏం చేయబోతున్నాయి?

సంక్షోభం నుంచి బయటపడటానికి 2022 చివర్లో లేదా 2023 మొదట్లో ముగిసే ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ లో నష్టాలు రాకుండా అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి.  ఈ క్రమంలోనే అనవసరంగా కనిపించిన వర్క్ ఫోర్స్, ప్రకటనలు వంటి వాటిని మరికొన్ని వారాలపాటు  తగ్గించుకోనున్నాయి. త్వరలోనే పరిస్థితులు చక్కబడవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

May Day History in Telugu: కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా, మే డే గురించి ప్రత్యేక కథనం ఇదిగో, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో..

May Day Wishes in Telugu: మే డే శుభాకాంక్షలు తెలుగులో, కార్మికుల దినోత్సవం రోజున శ్రామికులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి

JN.1 Variant in India: దేశంలో 971 కి పెరిగిన JN.1 కేసులు, కొత్తగా 609 మందికి కరోనా, నిన్న ముగ్గురు మృతి, నేటి కరోనా వైరస్ కేసుల అప్‌డేట్స్ ఇవిగో..