
Hyderabad, Nov 22: హైదరాబాద్ లోని (Hyderabad) పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ (IT) మెరుపు దాడులు చేపట్టింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు (Raids) నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (MAllareddy).. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని (Kompally) పాం మెడోస్ విల్లాలోనూ తనిఖీలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.