Kolkata Doctor Rape-Murder: కోల్‌ కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్.. హతురాలి శరీరంలో దొరికిన ఆ 150 గ్రాములు వీర్యం కాదట.. ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనం

లైంగిక దాడికి గురైన ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ఇటీవల పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

Kolkata Doctor Rape-Murder Case

Kolkata, Aug 17: దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన కోల్‌ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో (Kolkata Doctor Rape-Murder Case) మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లైంగిక దాడికి గురైన ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం (Semen) ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ఇటీవల పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దీనిని బట్టి ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందని అందరూ భావించారు. బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు కూడా కోర్టులో ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని జాతీయ మీడియా ‘న్యూస్ 18’ కథనాన్ని బట్టి తెలుస్తుంది.

సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

అసలేం తేలింది?

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హతురాలి శరీరంలో ఉన్నది 150 గ్రాముల గర్భసంచి మాత్రమేనని అది వీర్యం కాదని తేలింది. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనంలో వెల్లడించింది. సాధారణంగా పోస్టుమార్టం రిపోర్టును డాక్యుమెంట్ చేస్తారు. అందులో అవయవాల బరువును కూడా పేర్కొంటారు. ఈ సందర్బంగా అందులో ప్రస్తావించింది 150 గ్రాముల బరువున్న గర్భసంచి గురించేనని, వీర్యం అని తప్పుగా ప్రచారం చేయడంతోనే కలకలం రేగిందని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్టు ‘న్యూస్ 18’ తెలిపింది. ఈ కేసులో డీఎన్ఏ ఎనాలిసిస్ ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్‌ ను ఢీకొన్న వస్తువు.. పట్టాలు తప్పిన 22 బోగీలు.. ప్రయాణికులు సేఫ్.. ట్రాక్ మీదకు ఆ మిస్టరీ వస్తువు ఎలా వచ్చింది?



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif