Lotus Symbol On Passport: కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు, తీవ్రంగా మండిపడుతున్న విపక్షాలు, క్లారిటీ ఇచ్చిన అధికార పక్షం, అది జాతీయ చిహ్నమన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ (MK Raghavan) లోక్‌సభ(Lok Sabha)లో నిన్న జీరో అవర్‌లో లేవనెత్తారు. పాస్‌పోర్టులను కూడా బీజేపీ వదలడం లేదని, వాటిపైనా తమ పార్టీ గుర్తును ముద్రించి ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. కాగా కమలం గుర్తు బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో ఈ వ్యవహరం వివాదాస్పదమైంది.

Indian Passport | Image used for representational purpose (File Photo)

New Delhi, December 13: కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు(Lotus Symbol On Passport) ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ (MK Raghavan) లోక్‌సభ(Lok Sabha)లో నిన్న జీరో అవర్‌లో లేవనెత్తారు. పాస్‌పోర్టులను కూడా బీజేపీ వదలడం లేదని, వాటిపైనా తమ పార్టీ గుర్తును ముద్రించి ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. కాగా కమలం గుర్తు బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో ఈ వ్యవహరం వివాదాస్పదమైంది.

కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌(Ministry of External Affairs Spokesperson Raveesh Kumar) స్పందించారు. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు ఇలా జాతీయ చిహ్నాన్ని గుర్తించినట్టు స్పష్టంచేశారు. అలాగే, ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషనల్‌ పద్ధతిలో ఉపయోగిస్తామని వెల్లడించారు.కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కమలం జాతీయ పుష్పమని(national flower) పేర్కొన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని రవీశ్ కుమార్ చెప్పుకొచ్చారు.