Kota Suicides: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య, ఈ ఏడాది 29కి చేరిన ఆత్మహత్యలు, ఏడాది వారిగా విద్యార్థుల మరణాలపై రాజస్థాన్ పోలీస్ డేటా ఇదిగో..
తాజాగా వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన నిషా యాదవ్ (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది
Kota, Dec 1: రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. తాజాగా వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన నిషా యాదవ్ (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరియా (Auraiya) జిల్లాకు చెందిన నిషా కోటాలోని మహవీర్ నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఉంటూ మెడికల్ పరీక్ష నీట్ కోసం ప్రిపేరవుతోంది. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన రాత్రి నిషా తండ్రి ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చెయ్యలేదు. గురువారం మరోసారి కాల్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. ఆందోళన చెందిన నిషా తండ్రి హాస్టల్ యాజమాన్యానికి ఫోన్ చేయగా.. వారు నిషా రూమ్‌కు వెళ్లారు. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తెరవకపోవడంతో డోర్స్ పగలగొట్టి లోపలికెళ్లి చూశారు. అక్కడ నిషా ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది.
రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.