Stampede at Mumbai's Bandra Railway Station: దీపావళి ఎఫెక్ట్.. బాంద్రా రైల్వే స్టేషన్‌ లో రద్దీ.. తొక్కిసలాట.. 9 మందికి తీవ్ర గాయాలు.. వీడియో ఇదిగో!

తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన ఈ తొక్కిసలాటలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Stampede at Mumbai's Bandra Railway Station (Credits: X)

Mumbai, Oct 27: దీపావళి (Diwali) పండుగ రద్దీ నేపథ్యంలో ముంబైలోని (Mumbai) బాంద్రా రైల్వే స్టేషన్‌ లో (Bandra Railway Station) తొక్కిసలాట (Stampede) జరిగింది. తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన ఈ తొక్కిసలాటలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంద్రా-గోరఖ్‌ పూర్ ఎక్స్‌ ప్రెస్‌‌ ప్లాట్‌ ఫాం మీదికి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను బాంద్రా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్ 

Here's Video

సకాలంలో పోలీసులు స్పందించడంతో

తొక్కిసలాట కారణంగా గాయపడిన వారి రక్తపు మరకలు ఫ్లాట్‌ ఫాం నిండా కనిపించాయి. కొందరు ప్రయాణికులు స్పృహ తప్పి ప్లాట్‌ ఫాంపై పడిపోయారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించడంతో ముప్పు తప్పింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి