Ratan Tata Death News Updates: మెగా ఐకాన్...దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. దేశానికి ఎనలేని కృషి చేశారంటూ కితాబు
ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వయోభారంతో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.
Hyd, Oct 10: ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వయోభారంతో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.
టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా 1991లో బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌ను మరింత విస్తరించారు. 100 మిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు టాటా. పారిశ్రామిక వేత్తగానే కాకుండా సామాజికవేత్తగాను తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన సంపాదించిన దాంట్లో కొంతభాగాన్ని ఛారిటికి ఖర్చు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయిది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రతన్ టాటా జీ దూరదృష్టి గల వ్యాపార వేత్త, దయగల ఆత్మ, అసాధారణమైన మానవుడు. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఆయన వినయం, దయ, మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు అని ఎక్స్ ద్వారా వెల్లడించారు మోడీ. రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..
రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేను అని ఎక్స్‌లో పేర్కొన్నారు మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉంది...ఈ సమయంలో రతన్ టాటా లేకపోవడం బాధాకరం... మహోన్నతుడికి వీడ్కోలు. మిమ్మల్ని మరిచిపోలేము ఓం శాంతి అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
రతన్ టాటా మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు గౌతమ్ అదాని. దేశాభివృద్ధిపై ఆయన తీవ్ర ప్రభావాన్ని చూపారన్నారు. దేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన ఒక దార్శనికుడు. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడు మాత్రమే కాదు.. ఆయన సమగ్రత, కరుణ, తిరుగలేని నిబద్ధతతో దేశ స్ఫూర్తిని మూర్తీభవించారు. ఆయనలాంటి లెజెండ్‌లు ఎప్పటికీ మన మనసుల్లో నిలిచి ఉంటారని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.
Here's Tweet:
భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్. నిజమైన పారిశ్రామిక వేత్త అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు మెగాస్టార్.
రతన్‌టాటా ఓ లెజెండ్. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్ - రాజమౌళి
రతన్ టాటాది బంగారంలాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి గల వ్యక్తి. ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా - ఎన్టీఆర్
Here's Tweet:
The clock has stopped ticking. The Titan passes away. #RatanTata was a beacon of integrity, ethical leadership and philanthropy, who has imprinted an indelible mark on the world of business and beyond. He will forever soar high in our memories. R.I.P pic.twitter.com/foYsathgmt
Deeply saddened by the demise of legendary industrialist and true nationalist, Shri Ratan Tata Ji.
India has lost a giant, a visionary who redefined modern India's path. Ratan Tata wasn’t just a business leader - he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏 pic.twitter.com/mANuvwX8wV
Ratan Tata was a man with a vision. He has left a lasting mark on both business and philanthropy.
Deeply saddened by the passing away of Thiru. #RatanTata, a true titan of Indian industry and a beacon of humility and compassion.
Deeply saddened by the passing of Shri Ratan Tata, an iconic industrialist and visionary leader. His contributions to India's progress and philanthropy are immeasurable. His legacy of compassion, humility, and nation-building will continue to inspire generations.
My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…
It’s a sad day for all Indians.