AbhiBus Bumper Offer: బంపరాఫర్ ఇస్తున్న అభిబస్, టికెట్ బుక్ చూస్తే 3 కేజీల ఉల్లి ఉచితం, గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే, డీల్ ఆఫ్ ది ఇయర్ అంటున్న అభిబస్
ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తిని కొంటే ఉల్లిపాయలు ఉచితం అంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అభిబస్ కూడా తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.
Mumbai, December 13: ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు తెలివిగా ఈ అంశాన్ని తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తిని కొంటే ఉల్లిపాయలు ఉచితం అంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అభిబస్ కూడా తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.
ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ సంస్థ అబిబస్.కామ్ (Abhibus) వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్ ద్వారా గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని(Three kilogram of onions) బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిని డీల్ ఆఫ్ ది ఇయర్( Deal Of The Year) గా ఆ సంస్థ తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ ఎక్కువగా గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్ ఐఫోన్ (Apple IPhone) లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అభిబస్ ప్రకటించినప్పటికీ ఎక్కువమంది బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
Here's Tweet
దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. 54శాతం మంది వినియోగదారులు గోవా (Goa)పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు.
Here's Tweet
ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. డిసెంబర్ 15 వరకు ఉండే ఈ ఆఫర్ కోసం అభిబస్ వెబ్‌సైట్ ద్వారా గోవా టూర్ (Goa Trip) బుక్ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్ తెలిపారు.