Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

సీపీ నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్‌కు వచ్చిన విష్ణును గంటన్నర సేపు విచారించారు సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి...శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Actor Manchu Vishnu meets Rachakonda Police Commissioner G Sudheer Babu(X)

Hyd, Dec 12:  నటుడు మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. సీపీ నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్‌కు వచ్చిన విష్ణును గంటన్నర సేపు విచారించారు సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి...శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జల్‌పల్లి నివాసంలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీని పంపించాలని విష్ణును ఆదేశించిన సీపీ...జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్ల పై విష్ణు సంతకాలు తీసుకున్నారు. శాంతి భద్రతలు విగాథం కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం, రాచ‌కొండ క‌మిష‌న‌ర్ ముందు మంచు మ‌నోజ్ బైండోవ‌ర్ 

మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని నటుడు మనోజ్‌ పహడీషరీఫ్ పోలీసులకు కంప్లైంట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మరోవైపు మోహన్ బాబుకు సీపీ జారీ చేసిన నోటీసులు, విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం ఈ నెల 24 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.



సంబంధిత వార్తలు