Bird Flu In Kerala: కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్, 13 వేల కోళ్ల కాల్చివేతకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు, కరోనా మరచిపోకముందే వణికిస్తున్న మరో వ్యాధి, ఈ వ్యాధికి 2016లో వేలాది బాతులు మృత్యువాత

కోజికోడ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు (Chickens) బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు.ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu In Kerala) సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.

Representational image (Photo Credit: Pixabay)

Tiruvanathpuram, Mar 08: ప్రపంచాన్ని వైరస్‌లు వణికిస్తున్నాయి. ఒకటి పంజా విప్పగానే దాని వెనక మరొకటి దాడి చేస్తోంది. ఈ భయంకరమైన వైరస్‌లు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ వైరస్, కరోనా వైరస్..ఇలా పలు వైరస్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.

కాటేస్తున్న కరోనా, ఆరు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ మెసేజ్

తాజాగా కర్నాటక రాష్ట్రంలో మంకీ వైరస్‌తో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం (Bird Flu Scare Hits Kerala) రేగింది. కోజికోడ్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో కోళ్లకు (Chickens) బర్డ్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వైరస్ 12 వేల 900 కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu In Kerala) సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ కోళ్లను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లాల్లో రెండు గ్రామాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. కొడియాతూర్, వెంగర గ్రామాల్లో రెండు వారాలుగా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. అసలు ఎందుకు చనిపోతున్నాయనే విషయం తెలియక పౌల్ట్రీ యజమానులు తలలు పట్టుకున్నారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఓరి దేవుడా..మళ్లీ కోతి జ్వరం వచ్చింది

భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ సంస్థకు కోళ్ల రక్తనమూనాలను పంపించారు. పరీక్షలు నిర్వహించిన వారు..వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. వీటిని చంపకపోతే మరిన్ని కోళ్లకు విస్తరించి ప్రజలకు నష్టం చేకూరుతుందని కేరళ ప్రభుత్వం భావించింది. వెంటనే వీటిని కాల్చిపడేయాలని ఆదేశాలు జారీ చేసింది.

డేంజర్ జోన్‌లో కోనసీమ, కరోనాను తలదన్నేమరో కొత్త వైరస్

కాగా బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. గాలి ద్వారా త్వరగా వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 12 వేల 900 కోళ్లు బతికి ఉంటే చాలా ప్రమాదమని, వీటిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా 25 బృందాలను ఏర్పాటు చేసింది.

10 కి.మీ. పరిధిలోని గ్రామాలను అలర్ట్ చేశారు. ఆ పరిధిలో ఇంకేవైనా పౌల్ట్రీ ఫాంలకు వైరస్ సోకిందేమోనని పరిశీలిస్తున్నారు. పౌల్ట్రీ సమీపంలో నివాసం ఉండే వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పక్షులకు..ఇతర జంతువులకు సోకిందా ? అని ఆరా తీస్తున్నారు. నష్టపరిహారం కూడా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ వెల్లడించారు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నేపథ్యంలో వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని.. అలాగని భయపడాల్సిన పని లేదని ఆమె వివరించారు. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. చివరిసారిగా 2016లో కేరళలో బర్డ్ ఫ్లూ సోకింది. అళప్పురలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేలాది బాతులు మృత్యువాతపడడ్డాయి. వైరస్ సోకిన వేలాది బాతులను చంపి, పాతిపెట్టారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తాజాగా మళ్లీ అక్కడ బర్డ్‌ ఫ్లూ సోకడంతో కలకలం రేగుతోంది. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో చికెన్, కోడి గుడ్ల రేట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో కోడి మాంసాన్ని తినొద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వ్యాప్తి చెందుతుండటంతో కోళ్ల పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.