Uttarakhand Nurse : నిన్న కోల్ కతా - నేడు ఉత్తరాఖండ్, నర్సుపై అత్యాచారం- హత్య, 9 రోజుల తర్వాత బాడీ గుర్తింపు,దారుణ సంఘటన
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఎంతదారుణానికైన తెగబడేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే జూనియర్ డాక్టర్ హత్యాచారంతో కోల్ కతా అట్టుడికిపోతుండగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది.
Uttarakhand, Aug 16: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఎంతదారుణానికైన తెగబడేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే జూనియర్ డాక్టర్ హత్యాచారంతో కోల్ కతా అట్టుడికిపోతుండగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది.
తాజాగా అలాంటి మరో సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. నర్సుపై అత్యాచారం అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. మృతురాలి సోదరి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా 9 రోజుల తర్వాత మృతదేహం దొరికింది.
ఉత్తరాఖండ్ బిలాస్ పూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బిలాస్ పూర్ కు చెందిన ఓ మహిళ రుద్రపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే జులై 30న డ్యూటీకి వెళ్లిన బాధితురాలు ఇంటికి తిరిగిరాలేదు. ఆమె ఫోన్‌కు ఎంత ట్రై చేసినా స్వీఛాఫ్ వచ్చింది. ఆస్పత్రికి ఫోన్ చేయగా ఆమె సాయంత్రమే వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోల్‌కతాలో లేడి డాక్టర్‌పై అత్యాచారం తర్వాత హత్య, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం, ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం మమతా ప్రకటన
Here's Tweet:
ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించ ఓ ఆటోలో బాధితురాలు వెళ్తున్నట్లు గుర్తించారు. కానీ ఆ తర్వాత ఏం తేలలేదు. సరిగ్గా 9 రోజుల తర్వాత నర్సు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మృతురాలి ఫోన్ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందిన రోజు కూలీ ధర్మేంద్ర దగ్గర దొరికింది.
పోలీస్ స్టైల్‌లో ధర్మేంద్రను విచారించగా అసలు విషయం చెప్పేశాడు. ఆటో దిగి అపార్ట్ మెంట్ లోకి వెళుతున్న నర్సును బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమె స్కార్ఫ్ తోనే మెడకు బిగించి హత్య చేశానని చెప్పాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.