Agniveer Recruitment Rally: అగ్నివీరుల నియామక షెడ్యూల్ వచ్చేసింది, ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ, జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు (Agnipath military recruitment scheme) నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది.
New Delhi, June 20: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు (Agnipath military recruitment scheme) నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు (Indiain Army Issues Notification) ప్రకటనలో ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే ఇండియన్ ఆర్మీలో సైనికులిగా చేరే అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. అగ్నివీరులకు చాలా విశిష్టమైన ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో చెప్పారు. త్రివిధ దళాల్లో ఇండియన్ ఆర్మీ మొదటగా అగ్నివీర్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
అగ్నివీరులకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, వాళ్లకు డీఏ, మిలిటరీ సర్వీస్ పే ఉండదని ఆర్మీ తెలిపింది. అందరి తరహాలోనే రేషన్, డ్రెస్, ట్రావెల్ అలోవెన్స్‌లు అగ్నివీర్ సైనికులకు అందుతాయి. నాలుగేళ్ల కాలానికి 48 లక్షల జీవిత బీమా వస్తుంది.ఇండియన్ నేవీ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నేవీలోకి మహిళా నావికులను రిక్రూట్ చేయనున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత ఆ మహిళా నావికులకు యుద్ధ నౌకల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆఫీర్స్ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న ర్యాంకుల్లోనూ మహిళలను రిక్రూట్ చేయనున్నారు. ఓ వైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలకు తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది..
ఆయా విభాగాల్లో రిజిస్ట్రేషన్ ముఖ్యమైనతేదీలు
భారత సైన్యం జూన్ 20, 2022
వాయుసేన జూన్ 24, 2022
నావికా దళం జూన్ 21, 2022