Ahmed Patel Dies: కరోనాతో దెబ్బతిన్న అవయువాలు, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అస్తమయం, విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని నరేంద్రమోదీ తదితరులు..

నెల రోజుల క్రితం ఆయనకు కరోనా (Coronavirus) సోకగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస (Ahmed Patel Dies at 71) విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

Ahmed Patel (Photo Credits: Twitter)

New Delhi, Nov 25: కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) (Ahmed Patel Dies) కరోనా బారీన పడి కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆయనకు కరోనా (Coronavirus) సోకగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస (Ahmed Patel Dies at 71) విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

అహ్మద్​ పటేల్​ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన అహ్మద్‌ పటేల్‌ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

అసోం మాజీ సీఎం తరుణ్ గొగాయ్ కన్నుమూత, కరోనాతో ఒడిషా గవర్నర్ భార్య, గాంధీ మనవడు సతీష్ ధుపేలియా మృతి

అహ్మద్​ పటేల్​ (71) మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. విశ్వాసానికి, అంకితభావానికి ఆయన మారుపేరు. పూర్తి నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నెరవేర్చేవారు. సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారని అని తెలిపారు. అహ్మద్‌ పటేల్‌తో పార్టీకి, తనకు ఉన్న అనుబంధాన్ని సోనియా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

అహ్మద్‌ భాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి: ప్రధాని మోదీ

అహ్మద్‌ పటేల్‌ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘అహ్మద్‌ పటేల్‌ జీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితంలోని అత్యధిక కాలం ప్రజాసేవలోనే గడిపారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన కుమారుడు ఫైజల్‌తో మాట్లాడాను. అహ్మద్‌ భాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’’అని ప్రార్థించారు.

Here's Narendra Modi Tweet

Priyanka Gandhi Vadra Tweet

మిమ్మల్ని మిస్సవుతాం: రాహుల్‌ గాంధీ

‘‘ఇదొక విషాదకరమైన రోజు. కాంగ్రెస్‌ పార్టీ పిల్లర్‌ అహ్మద్‌ పటేల్‌. పార్టీ కోసమే ఆయన జీవితాన్ని ధారబోశారు. కఠిన సమయాల్లో వెన్నంటే ఉన్నారు. ఆయన ఒక వెలకట్టలేని ఆస్తి. మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతాం. ఫైజల్‌, ముంతాజ్‌, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు.

Rahul Gandhi expressing condolences: 

Ashok Gehlot expressing condolences

Randeep Singh Surjewala Tweet

అందరికీ స్నేహితుడు: రణదీప్ సుర్జేవాలా

అందరికీ స్నేహితుడు, ఎల్లప్పుడూ విధేయత మరియు విధిని నిర్వర్తించిన వారు..పార్టీని ఎప్పుడూ కుటుంబంగా భావించే వారు..రాజకీయ దాడులను ఎప్పుడూ వదిలిపెట్టిన వారు, వారి హృదయాలలో ఒక స్నేహమనే గుర్తును ఉంచుకున్నవారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నానంటూ .. వీడ్కోలు "అహ్మద్ జీ"అంటూ రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.