Ahmedabad Shocker: వరసలు మరచి కామాంధుడైన అన్న, చెల్లెలిపై మూడేళ్ల నుంచి అదే పనిగా అత్యాచారం, గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగులోకి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలవాల్సిన అన్నే కామాంధుడై సొంత చెల్లెలిపై లైంగిక దాడికి (allegedly raping minor sister) పాల్పడిన ఘటన గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Ahmedabad June 19: తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలవాల్సిన అన్నే కామాంధుడై సొంత చెల్లెలిపై లైంగిక దాడికి (allegedly raping minor sister) పాల్పడిన ఘటన గుజరాత్‌లో వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసముంటోంది. ఆమె తండ్రి అనారోగ్యంతో 14 ఏళ్ల క్రితమే మరణించగా.. ఇటీవల ఆ యువతి తల్లి సైతం ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన ఆ మైనర్‌ బాలికను ఆమె అన్నయ్య(26) మకార్బాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.

తనకు సంరక్షకులు ఎవరూ లేకపోడంతో బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సోదరుడు వావి వరసలు మరిచి సొంత చెల్లెలిపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని చెల్లెలిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలకు మైనర్‌కు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన వదిన తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించింది.

దారుణం..నచ్చిన ఛానల్ చూపిస్తానంటూ బాలికపై అత్యాచారం, శ్రీకాకుళం జిల్లాలో కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తన శరీరంలో మార్పులను కూడా గ్రహించలేకపోయిన పల్లెటూరి బాలిక

అక్కడ పరీక్షల అనంతరం బాలిక గర్భవతి అని తేలింది. దీనిపై వదని తల్లి యువతిని నిలదీయగా ఏడుస్తూ జరిగిన విషయం చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయంపై బుధవారం సర్కేజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2019 జనవరి 29 నుంచి నుంచి (multiple occasions) తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అతని భార్య పడుకున్న సమయంలో సోదరుడు అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఉన్మాది ఘాతుకం, అందుకు ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి చంపేశాడు, చింతల చెరువు గ్రామంలో దారుణ ఘటన, నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ( 26-year-old arrested) అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ 376 రేప్, 354A  sexual harassment కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif