Akola School Molestation Case: మహారాష్ట్రలో దారుణం, విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అలా చేద్దామంటూ ప్రభుత్వ టీచర్ లైంగిక వేధింపులు, అరెస్ట్ చేసిన పోలీసులు

వారిని అనుచితంగా తాకుతున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది.

Rape (Rep Image)

Mumbai, August 21: మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి ఘటన వెలుగు చూసిన రోజుల వ్యవధిలోనే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది.  నిద్రపోతున్న పసిపాపను వదలని కామాంధుడు, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణ అత్యాచారం

నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు. బాధిత విద్యార్థి ఒకరు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అధికారులు నిన్న స్కూలుకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ప్రమోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 74, 75 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు గత నాలుగు నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్టు బాలికలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆషా మిర్గే డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.థానే జిల్లా బద్లాపూర్‌లో పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ