Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి.

I will become CM for the fifth time: Chandrababu naidu in Andhra Pradesh Assembly Session

Vjy, Nov 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ఏపీ అసెంబ్లీలో మొత్తం 21 బిల్లులు ఆమోదం పొందాయి. 3 ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో వివిధ చర్చల్లో 120 మంది సభ్యులు పాల్గొన్నారు.

శాసనసభ (AP Assembly)లో ‘స్వర్ణాంధ్ర-2047’ (Swarna Andhra-2047) డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో హిట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదేపదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు.

షార్ట్‌, మీడియం, లాంగ్‌ టర్మ్‌ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కనబెట్టి వాళ్లు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.బరితెగించి తప్పులు చేసి.. ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు.

1995లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రజలకు చెప్తే సహకరించారు. అనివార్య పరిస్థితుల్లో అప్పట్లో రూ.2కి అందించే కిలో బియ్యం ధర పెంచాల్సి వచ్చింది. 1999లో విజన్‌-2020 తీసుకొచ్చాం. నాలెడ్జ్‌ ఎనానమీకి హైదరాబాద్‌ చిరునామాగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భద్రత ఉండాలి. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. వారికి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ప్రజలను చైతన్యం చేయాలి.

2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ పిలుపునిచ్చారు. మనం స్వర్ణాంధ్ర-2047 నినాదంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలపై గురుతర బాధ్యత ఉంది. నియోజకవర్గ పరిధిలోనూ విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేయాలి. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి. ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారు’’అని చంద్రబాబు అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif