IPL Auction 2025 Live

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు

ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

Vjy, Oct 30: ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని 54 మండలా­లను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీ­చేసింది.

కర్నూలు, అనంతపురం, శ్రీసత్య­సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థి­తులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండ­లాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరి­స్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థి­తులు నెలకొన్నా­యని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్ల­లో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్

అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదయ్యాయని ప్రస్తావించారు. 2023 ఖరీఫ్‌లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అదే 2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేపట్టారు.

రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు

అనంతపురం జిల్లా:  నార్పల, అనంతపురం

శ్రీసత్యసాయి జిల్లా:  తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల

అన్నమయ్య జిల్లా:  గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కి­రెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీ­కిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.

చిత్తూరు జిల్లా:  పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.

కరువు మండలాలు

కర్నూలు జిల్లా:  కౌతాలం, పెద్దకడుబూరు

అనంతపురం జిల్లా:  విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు

శ్రీసత్యసాయి జిల్లా:  కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కప­ట్నం, రామగిరి, పరిగి.

చిత్తూరు జిల్లా:  శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమ­ల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెం­క­ట­గిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం.