AP Assembly Approves Disha Act Bill: మహిళలపై అత్యాచారం చేస్తే ఇకపై ఉరిశిక్షే, శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం, 4 నెలల విచారణ సమయాన్ని కేవలం 21 రోజుల్లో పూర్తి చేసేలా బిల్లు
ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం(Assembly session)లో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత(home minister sucharitha) ప్రవేశపెట్టారు.
Amaravathi, December 13: మహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్టు (AP disha Act) కు శాసనసభ ఆమోదం లభించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం(Assembly session)లో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత(home minister sucharitha) ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం అధికార ప్రతిపక్ష పార్టీలు దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టాలని ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దానికి ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ క్రిమిలన్ లా చట్టం 2019 (Andhra Pradesh Criminal Law Act 2019), ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు.
Here's Tweet
వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ వస్తుంది. ఈ యాక్ట్ (AP Disha Act Bill)ప్రకారం ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారు.
బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. దిశకు తగిన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి మరోసారి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
దీంట్లో భాగంగా..చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని..173, 309 సెక్షన్లలో మార్పులు తీసుకొస్తామన్నారు. అత్యాచార కేసుల్లో ఖచ్చితమైన ఆధారాలతో నిరూపణ అయితే దోషులకు మరణశిక్ష పడేలా మార్పుల్ని తీసుకొస్తామన్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరుస్తూ..అగౌరపరిచేలా పాల్పడినవారికి కూడా కఠిన శిక్షల్ని అమలు జరిగేలా చట్టాలను రూపొందిస్తామన్నారు.