IPL Auction 2025 Live

Bhabhi Ji Papad: బాబీజీ పాపడ్‌ తినండి, కరోనాను జయించండి, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వివాదాస్పద ప్రచారం, సుమోటోగా చర్యలు చేపట్టాలంటున్న నెటిజన్లు

తయారీదారులకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను.' అంటూ ఓ వీడియోలో రామ్ మేఘ్‌వాల్ స్పష్టం చేశారు.ఈ వీడియోలో మేఘ్వాల్‌ భాబీజీ పాపడ్‌ను చూపుతూ (Arjun Meghwal launches papad) కనిపించారు. ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్‌తో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ (antibodies) అభివృద్ది చెందుతాయని అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వ్యాఖ్యానించారు.

Union Minister Arjun Ram Meghwal Launches 'Bhabhi Ji Papad' (Photo Credits: Twitter)

New Delhi, July 24: కరోనా వైరస్ కోసం ఓవైపు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయి ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సరైన వ్యాక్సిన్ రాలేదు. అయితే కొందరు దీన్ని క్యాష్ చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి (Arjun Ram Meghwal) కూడా ఇందులో భాగం కావడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

వివరాల్లోకెళితే.. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఆత్మనిర్భర్ పథకం కింద తయారీదారులు బాబీజీ పాపడ్‌ను (Bhabhi Ji Papad) తయారుచేశారు.ఇది కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. తయారీదారులకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను.' అంటూ ఓ వీడియోలో రామ్ మేఘ్‌వాల్ స్పష్టం చేశారు.ఈ వీడియోలో మేఘ్వాల్‌ భాబీజీ పాపడ్‌ను చూపుతూ (Arjun Meghwal launches papad) కనిపించారు. ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్‌తో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ (antibodies) అభివృద్ది చెందుతాయని అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వ్యాఖ్యానించారు.

Watch Video:

అప్పడాలు తింటే కరోనా పోతుందని ప్రచారం చేయడం చౌకబారుతనమే అన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివాళ్ల కోసమే కాంగ్రెస్ హయాంలో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చామని యూత్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో సెటైర్ వేసింది. మరికొందరు నెటిజెన్స్ మాత్రం కేంద్రమంత్రి వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నవేళ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.

Here's Netizen Tweet

అయితే ఈ వీడియోపై ఇంతవరకూ బీజేపీ నుంచి కానీ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు.అయితే తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు (Bikaner)చెందిన కంపెనీ పేర్కొంది .



సంబంధిత వార్తలు

Kissik Lyrical Video Song Is Out Now: వామ్మో ఇంత కిర్రాక్ మాస్ బీట్ సాంగా? శ్రీ‌లీల స్టెప్స్ కు య్యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేసింది, చూసేయండి!

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం