Bipin Rawat: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకం, 65 ఏళ్లు వచ్చేవరకు పదవిలో బిపిన్ రావత్, ఆయన బాధ్యతలు ఓ సారి తెలుసుకోండి

డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Army chief General Bipin Rawat named India's first Chief of Defence Staff (Photo-ANI)

New Delhi, December 30: ఇండియా మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను(Army chief General Bipin Rawat) కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

త్రివిధ దళాలను సమన్యయపరిచే చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ పోస్టును తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మోడీ చెప్పిన విషయం అందరికీ విదితమే. కాగా ఈ సూచన గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది.

ఈనెల 24న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును(India's first Chief of Defence Staff) ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బాధ్యతలు ఇతర వ్యవహారాలపై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టుకు ఇండియన్ ఆర్మీ,(Indian Army) లేదా ఇండియన్ నేవీ, (Indian navy)లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (Indian Air Force) నుంచి నాలుగు నక్షత్రాలు కలిగి ఉన్న అధికారిని నియమించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించిన నిబంధనలను సవరించింది.

Here's Capt.Amarinder Singh Tweet

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) నాయకత్వంలోని కమిటీ.. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)(CDS) బాధ్యతలు, పాత్ర గురించి ఫైనలైజ్ చేశాక.. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దానికి ఆమోద ముద్ర వేసింది.

మిగతా మూడు విభాగాధిపతులతో సమానంగా సీడీఎస్‌ జీతభత్యాలను అందుకుంటారు. మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా సీడీఎస్ పని చేస్తార’ని మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. భారత త్రివిధ దళాలు మిలిటరీ వ్యవహారాల శాఖ కిందకు వస్తాయి.

Here's Lt Gen Satish Dua Tweet

త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా.. వీరి ముగ్గురిపైన ఓ అధికారిని నియమించాలని 1980ల్లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలా మంది సైనికులు, సీనియర్ అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

త్రివిధ దళాధిపతుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా.. సీడీఎస్ 65 ఏళ్లు వచ్చే వరకు లేదా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సీడీఎస్ ఏర్పాటుతో త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.

త్రివిధ దళాధిపతులను సీడీఎస్ డైరక్ట్ చేస్తాడు .ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా సిడిఎస్ ఉంటారు.ఆయుధాల కొనుగోలు, శిక్షణ, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు వంటివి నిర్వర్తిస్తారు.

మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కార్యక్రమాలు చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై ఆయుధాల కొనుగోలు విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌పై ఉంటుంది.



సంబంధిత వార్తలు